21 Jul 2009

On writing - Maugham

(But) To write was an instinct that seemed as natural to me as to breath, and I did not stop to consider if I wrote well or badly. It was not till some years later that it dawned upon me that it was a delicate art that must be painfully acquired. The discovery was forced upon me by the by the difficulty I found in getting my meaning down on paper.


-- The Summing Up

5 comments:

  1. Yeah, that's a pain.

    మొదట్లో బానే వుంటుంది. ఏది స్ఫురిస్తే అది ఎలా పడితే అలా రాసుకుంటూ పోతాం. తర్వాత్తర్వాత— మన ఆలోచనల్ని అవి స్ఫురించినప్పటి స్పష్టతతోనే కాగితం మీద పెడుతున్నామా లేదా అన్నది సమీక్షించుకోవడం మొదలుపెట్టినప్పుడు— అప్పుడు కష్టమైపోతుంది. You writing is not serving you anymore; you are serving it instead. అదో సుఖం. అదోరకం masochistic బానిసత్వం.

    ReplyDelete
  2. కవి Rimbaud మీద ఒకవ్యాసం చదివాను. ఈ వాక్యాలు ఆకర్షించాయి. మీరు చదువుతారని ఇస్తున్నాను:

    “The average poet turns to writing because he can’t compete with his schoolmates in track and football. High school dances frighten him. He never learns the proper passes that score with a chick in the back seat of a convertible. In fact, he never gets near one. But there are always a few girls, not very appetizing, most of them, who will be nice to a fellow who has made “The Lit.” So, he invests in a set of Dowson, Housman, and T.S. Eliot and starts in. This was not Rimbaud’s approach. He applied to literature, and to litterateurs, the minute he laid eyes on them, the devastating methods of total exploitation described so graphically in the Communist Manifesto. He did things to literature that had never been done to it before, and they were things which literature badly needed done to it . . . just like the world needed the railroads the Robber Barons did manage to provide.”

    ReplyDelete
  3. Thanks for the link! I didn't quite get what the author was trying to convey (for the lack of understanding of French/European Literature pre-Rimbaud time). But, yes... the quoted text did attract me too. Particularly these...

    "the devastating methods of total exploitation described so graphically in the Communist Manifesto. Some of them were not very applicable. He “ran” the vowels like he later ran guns to the Abyssinians, with dubious results. Usually, however, he was very successful — in the same way his contemporaries Jim Fiske and P.T. Barnum were successful. He did things to literature that had never been done to it before, and they were things which literature badly needed done to it . . ."

    Das Kapital, Communist Manifesto - నను చదవాలనుకున్న వాటి లిస్ట్ లో ఉన్నాయి. కానీ చాలారోజుల్నించీ వాయిదా వేసుకుంటున్నా. Partly due to the fear of what they might do to me. :)

    I will read ALL of Rimbaud's works though.

    ReplyDelete
  4. Partly due to the fear of what they might do to me. :)

    అవును. కొన్ని పుస్తకాలు భయపెడతాయి: వర్తమానపు కంఫర్ట్‌జోన్‌లో మనం ఆశించని ఏ ప్రభావాల్ని, ఎదురుచూడని ఏ మార్పుల్ని అవి మనలో కలిగించబోతాయోనని చదవటానికి తటపటాయిస్తాం; ముఖ్యంగా ఐడియలాజికల్ ఫిలాసఫీ ప్రధానంగా గల పుస్తకాలు. అవి చదివినాక, ఎప్పటికో చివరికి అవి మన భావాలపై కలిగించిన వ్యతిరేక ప్రభావాన్ని ఎదుర్కొని మనం బయటపడొచ్చు గాక; కానీ ఆ ఎదుర్కోవడం ఉంటుందే, ఆ మేధో మథనం, ఆ తార్కిక యుద్ధం, అది చాలా విసుగు పుట్టిస్తుంది. మన ఊర్ద్వోన్ముక గమనాన్ని తాత్కాలికంగానైనా నిలిపేస్తుంది. ఆ ఘర్షణలో మన పాత నమ్మకాల పునాదులు గట్టివైతే తట్టుకు నిలబడతాయి; బోలువైతే కుప్పకూలిపోతాయి. చచ్చినట్టు మళ్ళీ అంతా పునర్నిర్మించుకోవాలి. ఆ ఓపికా అవసరం వుంటేనే అలాంటి పుస్తకాల జోలికెళ్ళాలేమో.

    నేనైతే, సంకుచితమైన ఆలోచనా ధోరణి అని అనుకుంటే అనుకోండి గానీ, మార్క్స్ వేమీ చదవకూడదని ఎప్పుడో నిర్ణయించేసుకున్నాను. ఒక వేళ చదివినా, మొదటి పేజీ నుంచీ అపనమ్మకంతోనే, సమాంతరంగా ఓ వ్యతిరేక వాదన నిర్మించుకుంటూనే చదువుతానేమో. ఆ కాడికి అనవసరం కదా. పైగా నా పఠనా ప్రపంచంలో నేనభిమానించే వాళ్ళలో గొప్ప గొప్ప సామ్యవాద వ్యతిరేకులూ, disillusioned marxists కుప్పలుగా కనిపిస్తున్నారు; అందుకే వాటిని చదవడం ఇప్పుడు తిరోగమనం అనిపిస్తుంది. ఓ ప్రక్క రష్యాలాంటి వికటించిన ప్రయోగఫలితాలు కనిపిస్తూనే వున్నవాయె.

    నేననుకోవడం బహుశా మీరు ఆ పుస్తకాల్ని యుద్ధం చేసే ముందు శత్రుబలాన్ని అంచనాకట్టే తీరున చదువుతారేమో. If that's the case, best of luck with the battle :)

    ReplyDelete
  5. నేననుకోవడం బహుశా మీరు ఆ పుస్తకాల్ని యుద్ధం చేసే ముందు శత్రుబలాన్ని అంచనాకట్టే తీరున చదువుతారేమో

    :)

    అవును. కొంతవరకూ మీరు చెప్పినది నిజమే. :)

    మార్క్స్ రచనలు చదవాలనుకోవటానికి కారణం, ఇంతవరకూ అక్కడా ఇక్కడా నేర్చుకున్న దాని ప్రకారం marxist conception of money కొంతవరకూ మిగతా సిద్ధాంతాలకన్నా superior అనిపించడం. ఆ అనిపించడం ఎంతవరకూ నిజమో ప్రత్యక్షం గా తెలుసుకోవాలి.

    కాపిటలిజాన్ని సమర్థించే ఆర్థికవేత్తలు "money, wealth, surplus value, commodity, financial crises, credit" మొదలైనవాటిని వివరించడానికి "rational choices, individual intentions" వంటి కాన్సెప్టులను సహాయం గా తీసుకుంటారు. ఒకవేళ Intention కూ results కూ అసలు సంబంధమే లేకపోతే? (నిజానికి లేదు) వీటిని ఇంకోరకం గా వివరించలేమా అని తెలుసుకోవాలి. మార్క్సిస్ట్ ఆర్థికవేత్తలు పై చెప్పిన లాంటి వివరణలు వ్యతిరేకిస్తారని కొందరి ద్వారా విన్నాను. అది తెలుసుకోవాలి.

    మిమ్మల్ని చదవమని కాదు కానీ, ఊరికే సమాచారం అంతా ఒకచోట ఉండాలని ఒక పుస్తకం గురించి ఇక్కడ రాస్తున్నా -

    idealization and conretization: a marxist conception of science అన్న పుస్తకం లో ఒకతను Das kapital ను మొత్తం 300 పుటల్లో re describe చేసాడట. అది చదవాలి. కానీ ఇప్పట్లో కుదిరేలా లేదు.

    ప్రస్తుతానికి కవితాజగత్తులో ఏదో ఏదో పోగొట్టుకున్నోడిలా(ఏం పోయిందో తెలియకుండా) విహరించడమే చాలాబాగుంది :)

    ReplyDelete

On Happiness, Need and Conflicts - SN Balagangadhara

Insightful paper from one of the greatest philosopher I have known so far. SN Balagangadhara . Full paper here . How important is to teach t...