"రచయిత ఎప్పుడూ ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం వ్రాసేది ఎంతమందిని సముచ్చకితుల్ని చేస్తుంది ఎంతమందిని ఉత్తేజం చేస్తుంది, కదిలిస్తుంది, ఏ ఘనకార్యం సాగిస్తుంది? ఈ అంతర్గత బాధ కలగకుండా ఈ భావం స్ఫురించకుండా ఏదో రాస్తూ పోవడం ఎందుకు? చెప్పవలసిన అవసరం వచ్చినపుడే, ఏదో స్ఫురించినప్పుడే, ఏదో మెరిసినపుడే, ఏదో మనసులో ఒక జలపాతం ఘోషించినప్పుడే చెప్పు. అక్షర హార్యాలషరాలను రెచ్చగొట్టు అవి మిగతాపని చేస్తాయి. అంతే గాని ఎందుకో రాస్తే ఎల్లా? వ్రాయవచ్చు, పత్రికలు వేయవచ్చు. కానీ లోకానికి ఏమి ఉపకారం. న్యూస్ ప్రింట్ ఖర్చు తప్ప..."-శేషేంద్ర శర్మ
ఎంతమందిని ఉత్తేజం చేస్తుంది, ఏం సాధిస్తుంది అని ఆలోచిస్తే చెప్పదలచుకున్న విషయాన్ని సరిగ్గా చెప్పగలగటం కుదురుతుందా? మనసున విరిసే మెరుపులూ, ఘోషించే జలపాతాలు ఎవడేమనుకుంటాడో, ఎవడికి అర్థం అవుతుందో లేదో అని ఆగుతాయా?
No comments:
Post a Comment