ఓ ముగ్గురు యువకులు ఇంకో దారి ఎంచుకున్నారు. నిజాం ను హతమార్చి హైదరాబాదు ను విముక్తం చేయటం. బాంబు దాడి. వారి పేర్లు - గండయ్య, నారాయణరావ్, జగదీష్.
మొత్తానికి ఆ ప్రయత్నం విఫలం అయ్యింది. నారాయణరావ్ విసిరిన బాంబు కారు తలుపు కు తగిలి క్రిందపడిపోయింది. నిజాం ఘాడు బ్రతికి బయటపడ్డాడు.
బాంబులు వేయటం నైతికమా, ఇది తీవ్రవాదమా అన్న విషయాలు పక్కన పెడితే - ఈ సన్నివేశం గురించి చదివి మళ్ళీ ఇక్కడికి రాసుకోవడానికి గల కారణం ఒక కవి. బాంబుదాడిలో విఫలమై పోలీసుల చేతికి చిక్కిన నారాయణరావ్ గురించి వరంగల్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఉద్యమకారులకు తెలిసిందట. వారి లో వటికోట ఆళ్వార్ స్వామి, స్వామి రామానంద తీర్థ, దాశరథి కృష్ణమాచార్య, జంగారెడ్డి, బూర్గుల లాంటి వాళ్లున్నారు. ఈ వార్త విన్న దాశరథి ఒక కవిత చెప్పాడు:
ఒక కప్పు అగ్నిరసం తాగించిన
నారాయణరావ్!
నీ హస్తం విసిరిన ’రవిగోళం’(గ్రనేడ్)
నరకాసుర మర్దనానికి
నడచిన యాదవయోధుని(కృష్ణుని)
కోదండ వినిర్గత బాణం.
నాల్గు డిసెంబరు నలభై యేడు
నారాయణరావ్!
నీలో అగ్ని సముద్రం ఉందట
నిజమేనా?
అగ్ని మనిషి!
నారాయణరావ్!
ఇవి కవితలో ని కొన్ని పంక్తులు మాత్రమే! అసలు దాశరథి చెప్పిన కవిత ఇంకా చాలా పెద్దదట.. కానీ ఆయన ఈ అనుభవాన్ని గ్రంథస్తం చేసే సరికి ది మాత్రమే గుర్తుందట.
దీని literary value ఎంతో నాకు తెలియదు కానీ (frankly, I dont care)... నన్నాకర్షించినది, మళ్ళీ ఆ సందర్భం. ఎవరు చెప్పారు కవితలు కడుపు నిండిన సోమరుల రసాస్వాదన సాధనాలని? యేళ్లు గడిచిపోయినాక, ఉద్యమంతో ఏ సంబంధం లేకపోయినా, చదువుతున్నప్పుడు వొంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. మరి ఈ దాశరథి అప్పట్లో తన సహచరులనూ, ఆ కాలపు యువతనూ ఎంతగా ప్రభావితం చేసుంటాడో!!
No comments:
Post a Comment