"ఓ జిజీవిషా! నీవు మాత్రం వర్థిల్లు, తెరచాపా తెగిపో, కెరటాల్లారా! ఉగ్ర రూపాలు ధరించండి, కుక్కల్లా నడవకండి... గాలీ! గాలివానల్ని పిలువ్. ఓ తీరమా! దూరమైపో, పడవా! పగిలిపో."
"సముద్రాలెక్కడ ఆకాశాన్ని పిడికిళ్ళతో పొడుస్తుంటాయో అక్కడికే పోతాను; తుఫానులతో స్నేహం చేస్తాను సింహాల సౌందర్యాన్నే ఉపాసిస్తాను. నా ప్రాణాలక్కడే పారేస్తాను..."
"నేనెక్కడున్నానని వెదుకుతుందీ లోకం! నిషాలన్నీ విడిచిపెట్టి ఇప్పుడు ఏ నిషాలో ఉన్నానో ఎలా తెలుసుకుంటుంది - జేబులో ఎ జ్ఞాపకాలు వేసుకువచ్చానో ఎవరికి తెలుసు? ఏ రాళ్ళకుటుంబాల్లో గుండె రెండుచేతుల్తో పుచ్చుకుని కన్నీటి బిందువులకోసం భిక్షాటన్ చేస్తున్నానో ఎవరికి తెలుసు -"
"నీ బాణానికి గురి ఎవరో శత్రువు నా బాణానికి గురి ఏదో హృదయం; గాలి వాలు తెలిసి ఎగిరిపడే పక్షివి నీవు గాలి కూడా భయపడే గమ్యం కోసం రగిలే పక్షిని నేను-"
ప్రతిభ అనే నేరం చేస్తే మీరు క్షమించరని నాకు తెలుసు కానీ నేను పుట్టేముందు నిర్దోషివి గా పుట్టమని నాకెవ్వరు చెప్పారు? దొరికిన నాలుగు సెకండ్లే జేబుల్లో వేసుకుని పోయే మీరెంత మంచివారు, కాలాన్నే మార్చాలని ఖడ్గమై ఇంకా ఊపిరి పీలుస్తున్న నేనెంత చెడ్డవాడ్ని - సిగ్గువిడిచి ఏకాకినని చెప్పుకోకు ఒక్క కన్నీటి బిందువు కూడా భిక్ష వెయ్యరు నీకు; గండ్రగొడ్డళ్ళు దొరికే గంధర్వలోకాలెక్కడున్నాయో వెతుక్కో మనిషికి ఒక యుగాన్నయినా ఇస్తావు-
~శేషేంద్ర, సముద్రం నాపేరు
పదం పదం, పేజీ పేజీ చదివేకొద్దీ నీ మీద నే మొదటిసారి లీలా మాత్రం గా ఏర్పరచుకున్న భావాన్ని బలపరుస్తున్నావ్ . నిజం గానే నువ్వు నేనడక్కుండానే నా పాటలు పాడుతున్నావ్!! నా లాంటి వారెందరివో!!
కోయిల పాటలూ సెలయేళ్ల చప్పుళ్ళూ పువ్వుల పరిమళాలూ ఎన్నిరోజులని ఆస్వాదిస్తాం?
ఋతువులు మారుతై, సెలయేళ్ళు ఎండుతై, పువ్వులు వాడుతై, పాటలు ఆగుతై
కానీ శేషేన్! ఋతువులను సవాలు చేసి సెలయేళ్లను శివాలెత్తించి పూలను తూటాలుగా మలిచి
నీలోని ప్రపంచం కోసం, ప్రపంచంలోని నీకోసం నువ్ పాడిన ఈ యుద్ధపు పాటలు మటుకు ఇలాగే నన్నున్మత్తుడ్ని చేస్తుంటాయ్!!
కోయిల పాటలూ సెలయేళ్ల చప్పుళ్ళూ పువ్వుల పరిమళాలూ ఎన్నిరోజులని ఆస్వాదిస్తాం?
ఋతువులు మారుతై, సెలయేళ్ళు ఎండుతై, పువ్వులు వాడుతై, పాటలు ఆగుతై
కానీ శేషేన్! ఋతువులను సవాలు చేసి సెలయేళ్లను శివాలెత్తించి పూలను తూటాలుగా మలిచి
నీలోని ప్రపంచం కోసం, ప్రపంచంలోని నీకోసం నువ్ పాడిన ఈ యుద్ధపు పాటలు మటుకు ఇలాగే నన్నున్మత్తుడ్ని చేస్తుంటాయ్!!
బాగుంది అండి. గాలి వాలు తెలిసి ఎగిరిపడే పక్షివి నీవు గాలి కూడా భయపడే గమ్యం కోసం రగిలే పక్షిని నేను-" బాగుంది కవిత.. ఆయనదే అనుకుంటా కదా "కవితా చాయ" పుస్తకం..
ReplyDelete