ఓ గీతికా! విను-
ఏ పుణ్యం చేసుకున్నానో ఉల్కలా వచ్చిన
ఒక్క క్షణం కాంతిలో
జీవన కఠోర సత్యదర్శనం చేసుకుంటున్నాను;
నీ మోహినీత్వం తో నన్ను మోసం చెయ్యకు
నా అపూర్వ సంపదలాంటి ఈ క్షణాల్ని దొంగిలించుకునిపోకు,
నా బాధల్ని మరిచిపోనీకు.
మరిచిపోతే, నాచేత బద్దలుకావలసినవన్నీ క్షేమంగా ఉండిపోతాయ్
హేయ్! పువ్వులూ పక్షులూ! మీ గొంతులు కట్టి పెట్టండి
నా తుపాకీ నన్ను తీసుకోనీండి
అసహ్యతను సహిస్తూ నిద్రిస్తున్న మనస్సుల్ని మేల్కొల్పనీండి వాటిని భయంకర
ఝంఝామారుతాలుగా మార్చనీండి
ద్వేషించే విద్య నేర్పనీండి
ద్వేషించడం ఎంత పవిత్ర వస్తువో బోధించనీండి; ద్వేషించడానికి
కావలసిన స్పృహని నా రక్తం తో దానం చెయ్యనీండి -
గాలిలో ఉన్నా కాగితాలెక్కినా ఈ మాటలు వాళ్ళలో అగ్నిపర్వతాలు నాటనీండి
.
.
.
~ నా దేశం, నా ప్రజలు; మహాకవి శేషేంద్ర.
నూరుకోట్ల నడిచే కళేబరాల్లోకి నీ కవితల సూదులు చెక్కి *కనీసం* ద్వేషాన్నయినా రగుల్చు!
"నా దేశం, నా ప్రజలు" మీకెక్కడ దొరికింది ? మొన్న విశాలాంధ్ర కి వెళితే శేషేంద్ర ఇంటర్వ్యూలు, సముద్రం నాపేరు మాత్రమే దొరికాయి, మిగతావన్నీ Out of print అని చెప్పారు :(
ReplyDeleteకోటి లో ఆర్యసమాజ్ ఎదురుగా ఒక స్ందులో రెండు మూడు పుస్తకాల షాపులున్నాయండి. అక్కడ నవయుగ పబ్లికేషన్స్ కూడా ఉంది, గోపాల్ బుక్స్ కి ఎదురుగా.. అందులో దాదాపు శేషేంద్ర గారి పుస్తకాలన్నీ దొరుకుతాయి, ప్రయత్నించండి.
ReplyDeleteఒకవేళ దొరక్కపోతే నాకు చెప్పండి, నా దగ్గరున్న పుస్తకం ఇస్తాను! :)
ఐతే కష్టమే, నేనుండేది బెంగుళూరు :(
ReplyDeleteఈసారి హైద్ వచ్చినప్పుడు ప్రయత్నిస్తాను. దొరక్కపోతే మిమ్మల్నే అడుగుతాను :)