3 Jan 2010

శేషేంద్రజాలం

నీవు కాలేజికి పోతుంటే బాబూ
నిన్ను పొలాలు బిక్కమొహంతో చూస్తున్నాయి
నీవు కాలేజి గోడల్లోకి పోతావు
అక్కడ్నించి గవర్నమెంటు గోడల్లోకి పోతావు
ఆ తర్వాత ఎప్పుడూ ఎవ్వరూ
తిరిగిరాని గోడల్లోకి పోతావు
ఇక నీవు బ్రతికిందెప్పుడు?
బాబూ! నీ చిన్ని కన్నీటి బిందువులో
ఏ సముద్రం గర్జిస్తోందో నాకు తెలుసు
అందుకే చెట్లతో మొరపెట్టుకుంటున్నాను
ఆకులు కాదు తుపాకులు కాయండని-

ఇది రాసి ఎన్నేళ్ళయిందోగాని ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పేమీ లేదు. అప్పుడు గవర్నమెంటు గోడల్లోకి, ఇప్పుడు అమెరిక కలల్లోకి...

*********

బేటావాడ్ని మాత్రం నమ్మకు
వాడు జెండాలెగరేసే దొంగ
నీళ్ళున్నచోటికి ఎగిరిపోయే కొంగ
ఉదయకిరణాలు పోలీసుల్లా
వెదుకుతున్నాయి ఏదో తీవ్రంగా
పాపం వాటికి తెలీదు
రక్తకణాల్లో దాక్కొ ఉన్న దొంగల్ని
రాష్ట్రపతి కూడా పట్టుకోలేడు.

**********

ఒరే! ఈ దేశం మీకేమిచ్చింది?
వంకరటింకర్లుగా ఒంగే దేహం
బానిసత్వం మీద వ్యామోహం
మీరెగరేశే జెండా మీకేమిచ్చింది?
ఐదేళ్లకొకసారి ఓట్లు
ఆ మధ్యలో కునికిపాట్లు!

*********

3 comments:

  1. యోగి గారు:
    మొదటి కవిత చాలా బాగుంది. నిజమే, ఇప్పుడు బహుళ జాతి సంస్థల గోడల మధ్య ఇరుక్కుమ్టున్నాము.
    -గణేష్

    ReplyDelete
  2. పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  3. మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ www.jeevanianantapur.org ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
    kathasv@gmail.com
    jeevani.sv@gmail.com

    మీ,

    జీవని.

    ReplyDelete

On Happiness, Need and Conflicts - SN Balagangadhara

Insightful paper from one of the greatest philosopher I have known so far. SN Balagangadhara . Full paper here . How important is to teach t...